Current Affairs Telugu Daily

ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు సీఈఓ బిన్నీ బన్సల్‌ రాజీనామా 
ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్‌ (37) 2018 నవంబర్‌ 13న తన పదవికి రాజీనామా చేశారు.
  • ఆయనపై వచ్చిన ‘తీవ్ర వ్యక్తిగత దుష్ప్రవర్తన’ ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే, బిన్నీ రాజీనామా చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ మాతృసంస్థ వాల్‌మార్ట్‌ ప్రకటించింది.
  • ఒక మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల వల్లే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. 
  • దేశీయ అతిపెద్ద ఇకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను సచిన్‌ బన్సల్‌తో కలిసి బిన్నీ బన్సల్‌ స్థాపించాడు. తనపై వచ్చిన ఆరోపణలను బిన్నీ బన్సల్‌ గట్టిగా తోసిపుచ్చినట్లు వాల్‌మార్ట్‌ పేర్కొంది.
  • బిన్నీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వాల్‌మార్ట్‌ తరఫున స్వతంత్ర విచారణ నిర్వహించారు. 
  • ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓగా కల్యాణ్‌ కృష్ణమూర్తి కొనసాగనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో మింత్రా, జబాంగ్‌ విలీనమైనా కూడా, ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లుగా కొనసాగుతూ, అమ్మకాలు సాగిస్తున్నాయి. ఇదంతా ఫ్లిప్‌కార్ట్‌ వ్యాపారం కిందే వస్తుంది. 

views: 701

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams