Current Affairs Telugu Daily

పీసపాటి వెంకటేశ్వర్లుకు రాయల్‌ సొసైటీ పురస్కారం 
రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ(RSC) దక్కన్‌ విభాగం గౌరవ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆచార్య పీసపాటి వెంకటేశ్వర్లు రాయల్‌ సొసైటీ పురస్కారం-2017కి ఎంపికయ్యారు. రాయల్‌ సొసైటీకి అందించిన సేవలకు గుర్తుగా ఆయనను ఏకగ్రీవంగా పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంబ్రిడ్జిలోని ఆర్‌ఎస్‌సీ ప్రధాన కార్యాయం లేఖ రాసింది. 2017 జులై 20న ఆర్‌ఎస్‌సీ అంతర్జాతీయ అధ్యక్షుడు జాన్‌ హాల్మన్‌ లండన్‌లో పురస్కారం అందజేస్తారు. పీసపాటి వెంకటేశ్వర్లు ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌, నైపర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. విద్యార్థుల్లో రసాయనశాస్త్రంపై అవగాహన పెంచే క్రమంలో పీసపాటి వెంకటేశ్వర్లు తెలుగు రాష్ట్రాల్లో సదస్సు నిర్వహించారు.
RSC-Royal Society of Chemistry 
RSC ప్రధాన కార్యాయం     : లండన్‌ (యూకె)

views: 948

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams