Current Affairs Telugu Daily

భారతీయ రైతు పీటర్‌ పావిటర్‌ ధిల్లాన్‌కు కెనడా ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు
కెనడాలో వ్యవసాయ రంగంలో చేసిన కృషికిగాను భారతీయ రైతుకు కెనడాలో అరుదైన గౌరవం దక్కింది.
  • ‘కెనడియన్‌ అగ్రికల్చరల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ (సీఏహెచ్‌ఎఫ్‌ఏ)’ లో రైతు పీటర్‌ పావిటర్‌ ధిల్లాన్‌ పేరును చేర్చారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేసిన వారి పేరును సీఏహెచ్‌ఎఫ్‌ఏలో చేర్చి వారి విజయాలను ఆ సంస్థ ప్రచారం చేస్తుంది.
  • కెనడాలోనే అత్యధిక క్రాన్‌బెర్రీ పంటను పండించినందుకుగాను ధిల్లాన్‌ను సంస్థ ఇలా గౌరవించింది. పంజాబ్‌, హోషియార్‌పూర్‌లోని పాండోరి గ్రామం నుంచి 1950లో ధిల్లాన్‌ తండ్రి రాచ్‌పాల్‌ సింగ్‌ ధిల్లాన్‌ కెనడాకి వచ్చారు.
  • 19 ఏళ్ళ వయస్సులోనే రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌లో చేరిన తొలి ఇండో కెనడియన్‌గా పీటర్‌ ధిల్లాన్‌ గుర్తింపు పొందాడు.
  • అనతి కాలంలో డిప్యూటీ షరిఫ్‌గా ధిల్లాన్‌ ఎదిగారు. బ్రిటన్‌లో లా పూర్తిచేశాక ధిల్లాన్‌ కుటుంబం 1993లో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ధిల్లాన్‌ 2000 ఎకరాల్లో క్రాన్‌బెర్రీ పండిస్తున్నారు.
  • ప్రపంచంలోనే అత్యధిక క్రాన్‌బెర్రీ సాగుచేస్తున్నవారిలో ధిల్లాన్‌ రెండో స్థానంలో ఉన్నారు. రిచ్‌మండ్‌, బ్రిటిష్‌ కొలంబియాల్లో రిచ్‌బెర్రీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ పేరుతో క్రేన్‌బెర్రీ ఉత్పాదక పరిశ్రమలను నిర్వహిస్తున్నారు.
  • 2017లో రిచ్‌బెర్రీ గ్రూప్‌ రూ.188 కోట్ల విలువైన క్రాన్‌బెర్రీను పండించింది. అమెరికా, కెనడా ల్లోని క్రాన్‌బెర్రీ మార్కెటింగ్‌ కో-ఆపరేటివ్‌ ‘ఓషియన్‌ స్ప్రే’క్యి ప్రస్తుతం దిల్లాన్‌ చైర్మన్‌. 2014లో తొలిసారిగా దిల్లాన్‌ ఓషియన్‌ స్ప్రేకో ఆపరేటివ్‌ సొసైటీకి శ్వేతజాతీయేతర చైర్మన్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. 

views: 711

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams