Current Affairs Telugu Daily

IFPRI ఉపాధ్యక్షుడిగా మహేంద్రదేవ్‌
అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌(IFPRI) సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన సూర్యదేవర మహేంద్రదేవ్‌ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పౌష్టికాహారం, పేదరికం అంశాలపై ఆ సంస్థ పరిశోధనలు చేస్తుంటుంది. ప్రస్తుతం ఇండోనేషియాకు చెందిన మేరీ ఫంగెస్టు ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సంస్థకు గతంలో మనదేశానికి చెందిన ఈశ్వర్‌ అహ్లూవాలియా ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత భారతీయులు సభ్యులుగా ఉన్నారే తప్ప ఆ స్థాయికి ఎవరూ వెళ్లలేదు. తాజాగా వైస్‌ ఛైర్మన్‌గా మహేంద్రదేవ్‌ ఎంపికయ్యారు. 2019 సంవత్సరం వరకు ఆయన పదవిలో ఉంటారు. మహేంద్రదేవ్‌ రాసిన ‘పర్‌స్పెక్టివ్‌ ఆఫ్‌ ఈక్విటబుల్‌ డెవలప్‌మెంట్‌’ పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోడి ఆవిష్కరించారు. పలుసంస్థలకు మహేంద్రదేవ్‌ సలహాదారుగా, కన్సల్టెంట్‌గా ఉన్నారు. దేశంలో పేదరికాన్ని అంచనా వేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క ఆహార ఖర్చును మాత్రమే లెక్కిస్తే సరిపోదని సెల్‌ఫోన్‌ వినియోగం, విద్య, వైద్యం, కుటుంబ ఖర్చులు పరిగణనలోకి తీసుకోవాని చెప్పి మహేంద్రదేవ్‌ పలువురి ప్రశంసలను అందుకున్నారు.
IFPRI-International Food Policy Research Institute

views: 823

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams