Current Affairs Telugu Daily

పారిస్‌లో మొదటి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమం
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి 2018 నవంబర్‌ 11 నాటికి ఒక శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ప్రపంచ దేశాల అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు వర్షంలోనే నివాళు అర్పించారు.
  • అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, టర్కీ అధ్యక్షులు వరుసగా డొనాల్డ్‌ ట్రంప్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌లు, రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌, జర్మన్‌ చాన్స్‌ర్‌ ఏంజెలా మెర్కెల్‌, కెనడా, ఇజ్రాయెల్‌ ప్రధానులు జస్టిన్‌ ట్రూడో, బెంజమిన్‌ నెతన్యాహు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మొత్తం 70 మంది నేతలు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • పారిస్‌లోని చాంప్స్‌-ఎలైసెస్‌లో ఉన్న యుద్ధ స్మారకం ‘ఆర్క్‌ డి ట్రియంఫె’ వద్ద ఈ సంస్మరణ కార్యక్రమం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్‌ 11న ఉదయం 11 గంటలకు ముగిసింది.
  • ఈ యుద్ధంలో పౌరులు, సైనికులు కలిసి 1.8 కోట్ల మంది మరణించగా రెండున్నర కోట్ల మందికి పైగానే గాయపడ్డారు. నవంబర్‌ 11న మేక్రాన్‌ సారథ్యంలో దేశాధినేతలు ఆర్క్‌ డి ట్రియంఫె కింద ఉన్న ‘అన్‌నోన్‌ స్జోర్‌ (గుర్తు తెలియని సైనికుడు)’ సమాధి వద్దకు కాలి నడకన వెళ్లారు.  
  • నివాళి కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌ జాతీయగీతం మార్సెల్లైసెను పాడి ప్రారంభించారు. ఫ్రాన్స్‌, దాని మిత్ర దేశాల నుంచి 3,400 మంది ప్రస్తుత, మాజీ సైనికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల సైనిక పాఠశాలల నుంచి పిల్లలు వచ్చి, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల గాథను చదివి వినిపించారు. 
  • భారత్‌తో పాటు బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, మయన్మార్‌ తదితర దేశాల్లోనూ తొలి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కామన్వెల్త్‌ దేశాల అధినేతలు శాంతి సందేశాలు ఇచ్చారు. 

views: 800

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams