Current Affairs Telugu Daily

చైనాలో వేగవంతమైన బుల్లెట్‌  రైలు ‘ఫక్సింగ్‌’ ప్రారంభం 
స్వదేశీ పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన బుల్లెట్‌  రైలు ‘ఫక్సింగ్‌’ 2017 జూన్‌ 26న ప్రారంభమైంది. ఫక్సింగ్‌  రైలు అత్యధికంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దేశంలోనే అత్యంత రద్దీ మార్గంగా పేరొందిన బీజింగ్‌-షాంఘై మార్గంలో ‘ఫక్సింగ్‌’ రాకపోకలును ప్రారంభించారు. ‘సీఆర్‌400 ఏఎఫ్‌’ రకానికి చెందిన ఈ  రైలు కేవలం 5 గంటల 45 నిమిషాల్లో బీజింగ్‌ దక్షిణ రైల్వే స్టేషన్‌ నుంచి షాంఘై చేరుకుంది. అత్యవసర, ప్రమాదకర పరిస్థితుల్లో వేగం తగ్గించుకునేందుకు, స్వీయ ప్రదర్శనను నిరంతరం మదింపు చేసుకునేందుకు వీలుగా ఫక్సింగ్‌లో అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థ ఉంది. రిమోట్‌ డేటా ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ, కంట్రోల్‌ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు ఈ  రైలును నియంత్రించవచ్చు.
చైనా రాజధాని     : బీజింగ్‌ 
అధ్యక్షుడు    : గ్జీ జిన్‌పింగ్‌

views: 887

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams