Current Affairs Telugu Daily

మానవుని మెదడులాగే ఆలోచించే సూపర్‌ కంప్యూటర్‌
మానవుని మెదడులాగే ఆలోచించే సరికొత్త సూపర్‌ కంప్యూటర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
  • ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ సూపర్‌ కంప్యూటర్‌ను బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు.
  • మిలియన్‌-ప్రాసెసర్‌-న్యూరల్‌ కోర్‌ స్పైకింగ్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌ (స్పిన్నకర్‌) ఆధారంగా పని చేసే ఈ కంప్యూటర్‌ సెకన్‌కు 200 మిలియన్‌ మిలియన్ల విశ్లేషణలు చేయగలదు. ఇందులో వాడిన ఒక్కో చిప్‌ 10 కోట్ల ట్రాన్సిస్టర్లు కలిగి ఉంటుంది.
  • ఈ సూపర్‌ కంప్యూటర్‌ తయారీకి మొత్తం 30 సం॥లు పడితే ఇందులో పరిశోధనకే 20 ఏళ్లు, నిర్మాణానికి మరో 10 సం॥లు పట్టింది.
  • ఈ సూపర్‌ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసేందుకు మొత్తం రూ.141 కోట్లు ఖర్చయింది. మానవ మెదడులోని న్యూరాన్స్‌ లాగే ఈ కంప్యూటర్‌ స్పందను కలిగి ఉంటుంది. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదు.
  • మానవుని మెదడులోని రహస్యాలను ఛేదించి, విశ్లేషించడానికి న్యూరో శాస్త్రవేత్తలకు ఈ సూపర్‌ కంప్యూటర్‌ ఎంతగానోఉపయోగపడుతుంది. అతి తక్కువ శక్తితో రోబోలు కూడా మానవుని వలే మాట్లాడేందుకు, నడిచేందుకు ఈ కంప్యూటర్‌ దోహదపడుతుంది.

views: 814Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams