Current Affairs Telugu Daily

సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా 
కశ్మీర్‌ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధినేత సయ్యద్‌ సలాహుద్దీన్‌ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2017 జూన్‌ 26న ప్రకటించింది. ఈ చర్య నేపథ్యంలో సలాహుద్దీన్‌తో అమెరికా పౌరులెవరూ లావాదేవీలు జరపడానికి వీల్లేదు. అమెరికా పరిధిలోని అతడి సంపదపైనా ఆంక్షలు ఉంటాయి. సలాహుద్దీన్‌ అలియాస్‌ సయ్యద్‌ మొహమ్మద్‌ యూసుఫ్‌ షా ఉగ్రవాద చర్యలకు ప్పాడ్డాడని అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది. సలాహుద్దీన్‌ నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. అమెరికా చర్యను భారత్‌ స్వాగతించింది. ఉగ్రవాదులుగా, ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ముద్రవేసిన వ్యక్తులు, సంస్థలు ఏకాకి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చర్యతో అలాంటి వ్యక్తులు, సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఏ విధంగానూ వినియోగించుకోకుండా అడ్డుకట్ట పడుతుంది.
views: 815

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams