Current Affairs Telugu Daily

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2015-16
దశాబ్దం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో చిన్నారులు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారరని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2015-16 వెల్లడించింది. 2005-06 తర్వాత నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే నివేదికను విడుదల చేయడం ఇదే ప్రథమం. ఈ సర్వే ప్రకారం.. దేశంలో శిశు మరణాల రేటు గత దశాబ్ద కాలంలో 16 పాయింట్లు తగ్గింది. దశాబ్దం క్రితం ప్రతి వెయ్యి జననాల్లో ఏడాదిలోపు శిశు మరణాల సంఖ్య 57గా నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 41కి తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గింది. అయితే ఐక్యరాజ్యసమితి 2015లో శిశు మరణాల రేటుపై నిర్ధేశించిన మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్‌ 27 పాయింట్ల కంటే ఇది చాలా దూరంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌(54)లో అత్యధికంగా ఏడాదిలోపు శిశు మరణాల రేటు నమోదయింది.
views: 1017

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams