Current Affairs Telugu Daily

జర్నలిస్టు స్వాతికి ప్రెస్‌ ఫ్రీడమ్‌ అవార్డు
లండన్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ అవార్డు ఫర్‌ కరేజ్‌-2018 భారత్‌కు చెందిన పరిశోధనాత్మక ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ స్వాతి చతుర్వేదికి లభించింది.
  • సామాజిక మాధ్యమాల్లో వేధింపుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఆన్‌లైన్‌లో భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగాల విద్వేషపూరిత వేధింపులను ఆమె వెలుగులోకి తెచ్చారు.
  • ఇటలీ, టర్కీ, మొరాకోకు చెందిన జర్నలిస్టులను అధిగమించి ప్రియాంక ఈ అవార్డులను గెలుచుకున్నారు. ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగానే కాకుండా ఆమె ‘ఐ యామ్‌ ఏ ట్రోల్‌: ఇన్‌సైడ్‌ ది సీక్రెట్‌ వరల్డ్‌ ఆఫ్‌ ది బీజేపీ డిజిటల్‌ ఆర్మీ’ అనే పుస్తకాన్ని రచించారు.
  • 2018 నవంబర్‌ 8న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రిపోర్టర్స్‌ విత్‌ అవుట్‌ బోర్డర్స్‌(ఆర్‌డబ్ల్యూబీ) అనే సంస్థ అవార్డును స్వాతికి ప్రదానం చేసింది.

views: 657

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams