Current Affairs Telugu Daily

అవినీతితో పదవి కోల్పోయిన పుదుచ్చేరి ఎమ్మెల్యే అశోక్‌ ఆనంద్‌
అవినీతి నిరోధక చట్టం కింద పుదుచ్చేరిలో ఎమ్మెల్యే అశోక్‌ ఆనంద్‌ తన పదవి కోల్పోయారు.
  • ఆయన ప్రాతినిధ్యం వహించిన తట్టాంచావడి నియోజకవర్గం ఖాళీ అయినట్లు శాసనసభాపతి అధికారికంగా ప్రకటించారు.
  • పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి సారథ్యంలోని ఎన్నార్‌ కాంగ్రెస్‌కు చెందిన అశోక్‌ ఆనంద్‌ తండ్రి ఆనందన్‌ 2006-07లో పుదుచ్చేరి ప్రజాపనుల శాఖ చీఫ్‌ ఇంజినీరుగా ఉన్నప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.
  • దీంతో ఆనందన్‌, ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు అశోక్‌ ఆనంద్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వ్యాజ్యంపై అక్టోబరు 30న న్యాయమూర్తి ధనపాల్‌ తుది తీర్పునిచ్చారు.
  • విజయలక్ష్మి మరణించడంతో ఆమెను మినహాయించి ఆనందన్‌, అశోక్‌ ఆనంద్‌ను దోషులుగా పరిగణిస్తూ అవినీతి నిరోధక చట్టం కింద వారికి ఏడాది చొప్పున జైలుశిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
  • జరిమానా చెల్లించకుంటే మరో మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. వారు అక్రమంగా కూడబెట్టిన రూ.1.74 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేయాలని ఆదేశించారు.

views: 650

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams