Current Affairs Telugu Daily

భారత సైన్యంలోకి కొత్త శతఘ్నులు 
కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2018 నవంబర్‌ 9న సరికొత్త శతఘ్నుల్ని సైన్యంలో చేర్చారు.
  • నవంబర్‌ 9న మహారాష్ట్ర దేవ్‌లాలిలో జరిగిన కార్యక్రమంలో వీటిని సైన్యంలో ప్రవేశపెట్టారు. ఇందులో ఎం777 తేలికపాటి అమెరికా హోవిట్జర్లు, కె-9 వజ్ర శతఘ్నుతో పాటు, శతఘ్నిని తీసుకెళ్లే సమీకృత వాహనాలు ఉన్నాయి.
  • ప్రస్తుతం వాడుకలో ఉన్న శతఘ్నుల్ని తరలించేందుకు ఈ వాహనం తోడ్పడుతుంది. కె-9 వజ్ర అనేది స్వీయచోదక శక్తితో కూడిన శతఘ్ని.
  • 145 ఎం777ను పొందేందుకు భారత్‌ 2016 నవంబర్‌లో రూ.5,070 కోట్లతో అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఇరాక్‌, అఫ్గానిస్థాన్లలో ఉపయోగించిన వీటిని ఎత్తైన ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా తేలికగా రవాణా చేయవచ్చు. 

views: 637

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams