Current Affairs Telugu Daily

ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ 
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు.
  • రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఈ బదిలీకి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ 2018 నవంబర్‌ 8న ఉత్తర్వు జారీ చేసింది. రాజస్థాన్‌కు చెందిన జస్టిస్‌ రాఘవేంద్ర ఎస్‌ చౌహాన్‌ 1959 డిసెంబర్‌ 24న జన్మించారు.
  • 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో డిల్లీ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1983 నవంబరులో రాజస్థాన్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
  • రాజస్థాన్‌ హైకోర్టులో 1986 నుంచి జూన్‌ 2005 వరకు న్యాయవాదిగా క్రిమినల్‌, రాజ్యాంగ, సర్వీసు చట్టాల్లో ప్రాక్టీసు చేశారు. 2005 జూన్‌ 13న అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
  • కర్ణాటక హైకోర్టు జడ్జిగా 2015 మార్చి 10న ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ చౌహాన్‌ బదిలీ నిమిత్తం సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో కర్ణాటక హైకోర్టు నుంచి ఉమ్మడి హైకోర్టుకు ఆయన బదిలీ అయ్యారు.

views: 664

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams