Current Affairs Telugu Daily

ట్రావెల్‌ బ్యాన్‌కు అనుమతి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 6 ముస్లిం ప్రధాన దేశాల నుంచి వ్యక్తుల రాకపై విధించిన వివాదాస్పద నిషేధాజ్ఞలను ఆ దేశ సుప్రీంకోర్టు 2017 జూన్‌ 26న పాక్షికంగా పునరుద్ధరించింది. అమెరికాలోని సంస్థలు లేదా వ్యక్తులతో విశ్వసనీయ సంబంధం లేని వ్యక్తులపై అక్టోబరు వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడిరచింది. అక్టోబరులో ఈ కేసును తాము పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని తెలిపింది. అమెరికాతో వ్యక్తిగత సంబంధాలున్న వ్యక్తుపై ప్రస్తుతానికి ఆంక్షలను అమలు చేయకూడదని పేర్కొంది. కుటుంబ సభ్యులను చూసేందుకు, విశ్వవిద్యాయాల్లో చేరేందుకు వచ్చే విదేశీయులను అందుకు ఉదహరించింది. మరోవైపు, అమెరికాతో సంబంధం లేని విదేశీయుల రాకపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం ప్రధాన దేశాలైన ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, సిరియా, యెమెన్‌ల నుంచి పౌరుల రాకపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్‌ 2017 జనవరిలో కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం చెలరేగిన విమర్శలతో కాస్త వెనక్కి తగ్గి ఇరాక్‌ను ఈ జాబితా నుంచి తొలగిస్తూ 2017 మార్చిలో సవరణ ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ ఆంక్షల విషయంలో ట్రంప్‌కు రెండు ఫెడరల్‌ అప్పీళ్ల న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బులు తగిలాయి. ట్రంప్‌ ఆంక్షలు జాతీయత ఆధారంగా ప్రయాణికులపై వివక్ష చూపుతున్నాయని దిగువస్థాయి న్యాయస్థానాలు వ్యాఖ్యానించాయి. నిషేధాజ్ఞలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
అమెరికా రాజధాని    : వాషింగ్టన్‌ డి.సి.

views: 898

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams