Current Affairs Telugu Daily

దీపావళి వెలుగుతో అయోధ్యలో గిన్నిస్‌ రికార్డు 
దీపావళి సందర్భంగా అయోధ్య నగరంలోని సరయూ తీరంలో 2018 నవంబర్‌ 6న మూడు లక్షలకుపైగా దీపాలు వెలిగించడంతో గిన్నిస్‌ రికార్డుల్లో చోటుదక్కింది.
  • దీపోత్సవ్‌ వేడుక సందర్భంగా ఈ రికార్డు నమోదయింది. 5 నిమిషాల్లోనే 3,01,152 దీపాలు వెలిగించి అయోధ్యావాసులు ఈ రికార్డు సృష్టించారు.
  • ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడి సతీమణి కిమ్‌ జాంగ్‌ సూక్‌ సమక్షంలో ఈ రికార్డు నమోదయింది.
  • 2016లో హర్యానావాసులు ఒకేసారి 1,50,009 దీపాలు వెలిగించి గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించారు. ఈ రికార్డును ప్రస్తుతం అయోధ్యవాసులు బద్దలు కొట్టారు.
ఫైజాబాద్‌ జిల్లాను ‘అయోధ్య’గా పేరు మార్చనున్నట్లు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌  ప్రకటించారు. 

views: 620

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams