Current Affairs Telugu Daily

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జింబాబ్వే పర్యటన
జింబాబ్వే పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ దేశ అధ్యక్షుడు ఎమర్‌సన్‌ నన్‌గాగ్వా, ఉపాధ్యక్షుడు కెంటో మెహదీతో  2018 నవాంబర్‌ 4న హరారేలో సమావేశమయ్యారు.
  • అంతర్జాతీయ సౌరశక్తి సంకీర్ణ నిబంధనావళి (సోలార్‌ ఎయన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌) ఒప్పందంపై కెంటో మెహదీతో వెంకయ్యనాయుడు చర్చలు జరిపారు. ఆ తర్వాత జరిగిన ఉభయదేశాల బిజినెస్‌ ఫోరంలో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. 
  • జింబాబ్వేలో భారత రాయబార కార్యాలయ నూతన భవన నిర్మాణానికి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. హరారేలో నిర్మించనున్న భారత రాయబార కార్యాలయ నూతన భవంతిలో ప్రత్యేకంగా యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
  • 3 ఆఫ్రికా దేశాల్లో 6 రోజుల పర్యటనలో భాగంగా ఆయన జింబాబ్వేలో పర్యటించారు. 

views: 634

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams