Current Affairs Telugu Daily

ప్లాస్టిక్‌ బాటిళ్లతో ఏరోజెల్‌
ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారిన ప్లాస్టిక్‌ వ్యర్థాలకు విరుగుడుగా దీర్ఘకాలం మన్నే ఏరోజెల్స్‌గా మార్చే ప్రక్రియను సింగపూర్‌ శాస్త్రవేత్తలు  కనుగొన్నారు.
  • భవనాల్లో ధ్వనుల నుంచి రక్షణకు, చమురు తెట్టును శుభ్రం చేయడానికి, అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే మాస్కు, పైకోటుకు పైపూత వేయడానికి ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్‌ వ్యర్థం.. విషతుల్యం. అది మట్టిలో కలసిపోదు.
  • ఈ వ్యర్థం అంతిమంగా సముద్రాలు, నేలలోకి చేరుతోంది. ఫలితంగా సముద్రజీవులకు హాని కలుగుతోంది. భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ బాటిళ్ల వినియోగం నానాటికీ పెరుగుతోంది. 2021 నాటికి అది ఏడాదికి 50వేల కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా.
  • బాటిళ్లు పాలీఇథలీన్‌ టెరెప్థలేట్‌ (పీఈటీ)తో తయారవుతాయి. దీన్ని పీఈటీ ఏరోజెల్‌గా మార్చే విధానాన్ని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ పరిశోధకులు కనుగొన్నారు.
  • ఇది చాలా తేలికైన, చౌకైన విధానమని వెల్లడించారు. ఈ ఏరోజెల్‌ పదార్థం చాలా మృదువుగా, తేలిగ్గా ఉంటుంది. ఎటుకావాలంటే అటు వంచుకోవచ్చు. దీర్థకాలం మన్నుతుంది. దీన్ని ఉపయోగించడం చాలా సులువు.
  • వేడి, చలి నుంచి అద్భుతంగా రక్షణ కల్పించడం దీని ప్రత్యేకత. శోషించుకునే సామర్థ్యమూ ఎక్కువే. ఇన్ని క్షణాల వల్ల ఇది అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది.

views: 700

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams