Current Affairs Telugu Daily

క్రిస్టియన్‌ మహిళ కేసులో పాక్‌ కోర్టు సంచలన తీర్పు
దైవ దూషణ చేసిన క్రిస్టియన్‌ మహిళపై పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు కనికరం చూపింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ చీఫ్‌ జస్టిస్‌ సాఖిబ్‌ నిసార్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2018 అక్టోబర్‌ 31న తీర్పు వెలువరించింది.
  • క్రిస్టియన్‌ మతానికి చెందిన అసియా బీబీ ఇస్లాం మతాన్ని దూషిస్తూ తరచూ ఇరుగుపొరుగు వారితో గొడవకు దిగేది. తమ మతంపై అసియా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇస్లాంను దూషించిన అసియాకు బతికే అర్హత లేదని, ఆమెకు కఠిన శిక్ష విధించాలని 2009లో కోర్టును ఆశ్రయించారు.
  • పవిత్ర ఇస్లాం మతాన్ని దూషించి ప్రజల మనోభావాల్ని దెబ్బతీశావంటూ లాహోర్‌ హైకోర్టు 2010లో అసియాకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై పాకిస్తాన్‌ వ్యాప్తంగా కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా, మరికొందరు ఆమెకు పాపం పండిందని ఆనందం వ్యక్తం చేశారు.
  • హైకోర్టు తీర్పుపై అసియా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నిందితురాలు గత 8 సంవత్సరాలుగా ఏకాంతవాస శిక్షను అనుభవిస్తుండడంతో కోర్టు ఆమెకు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. 
  • అసియాకు ఉరిశిక్ష విధించిన లాహోర్‌ హైకోర్టు వ్యవహారాన్ని ఖండించి, ఆమెకు మద్దతుగా నిలిచిన పంజాబ్‌ గవర్నర్‌ సల్మాన్‌ తసీర్‌ 2011లో హత్యకు గురికావడంతో పాకిస్తాన్‌లో అలజడి రేగింది.
  • ఈ నేపథ్యంలోనే అసియా కేసులో కోర్టు జాగ్రత్తు చేపట్టింది. నిరసను చెలరేగకుండా పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటి ప్రధాని జియావుల్‌ హక్‌ 1980లో దైవ దూషణ నేరంగా పరిగణించే చట్టాలు తెచ్చారు. 

views: 794

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams