Current Affairs Telugu Daily

ముగిసిన కెప్లర్‌ టెలిస్కోపు శకం 
దశాబ్దం పాటు సౌర కుటుంబం వెలుపల, ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల(ఎక్సోప్లానెట్‌)ను పసిగట్టిన కెప్లర్‌ అంతరిక్ష టెలిస్కోపు శకం ముగిసిపోయింది.
  • విశ్వంలో మరిన్ని పరిశీలనలు సాగించేందుకు అవసరమైన ఇంధనం ఇందులో లేకపోవడంతో దీని సేవలకు స్వస్తి పలకాలని అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) నిర్ణయించింది.
  • కెప్లర్‌ తన ప్రస్థానంలో 2600కుపైగా ఎక్సోప్లానెట్లను గుర్తించింది. అందులో జీవులకు ఆవాసయోగ్యమైనవి కూడా ఉన్నాయి. ఈ టెలిస్కోపు తమ అంచనాలకు మించి పనిచేసిందని నాసా తెలిపింది. సౌర కుటుంబంలో, వెలుపల జీవుల అన్వేషణకు ఇది బాటలు పరిచిందని వివరించింది.
  • రాత్రిపూట మనకు కనిపించే నక్షత్రాల్లో 20 నుంచి 50 శాతం మేర తార చుట్టూ సమశీతోష్ణ ప్రాంతంలో భూమి పరిమాణంలోని గ్రహాలు ఉన్నాయని వెల్లడించింది. వాటిపై ద్రవ రూపంలో నీటికి ఆస్కారం ఉందని పేర్కొంది.
  • కెప్లర్‌ టెలిస్కోపును 2009 మార్చి 6న నాసా ప్రయోగించింది. సిగ్నస్‌ తారామండలంలోని 1.5లక్ష నక్షత్రాలను నిరంతరంగా పరిశీలించి, వాటి చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పసిగట్టడం దీని ఉద్దేశం. 4 సం॥ల పాటు సక్రమంగానే పనిచేసింది.
  • ఆ తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో కొంతకాలం దీని పరిశోధనకు బ్రేక్‌ పడింది. ఈ వ్యోమనౌక పరిశీలన ప్రదేశాన్ని 3 నెలలకోసారి మార్చడం ద్వారా దాన్ని కొనసాగించే ప్రక్రియను నాసా రూపొందించింది.
  • ‘కె2’ పేరుతో సాగిన దీని రెండో ప్రస్థానంలో 5 లక్షలకు పైగా తారలను పరిశీలించింది.

views: 741

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams