Current Affairs Telugu Daily

నాసా  సూపర్‌సోనిక్‌ పారాచూట్‌ ప్రపంచ రికార్డు 
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆవిష్కరించిన సూపర్‌సోనిక్‌ పారాచూట్‌ కేవలం 0.4 సెకన్‌ వ్యవధిలో విచ్చుకొని, 37 వేల కిలో బరువును విజయవంతంగా మోయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది.
  • నాసా 2020లో అంగారకుడి పైకి ప్రయోగించనున్న రోవర్‌ సురక్షితంగా కిందకు దిగడంలో ఈ పారాచూట్‌ కీలక పాత్ర పోషించే అవకాశముంది.
  • 17.7 మీటర్ల పొడవైన బ్లాక్‌ బ్రాంట్‌-11 సౌండింగ్‌ రాకెట్‌ను ప్రయోగించిన రెండు నిమిషాల్లోపే దాన్నుంచి పేలోడ్‌ విడిపోయి భూ వాతావరణంలోకి పడిపోయిందని నాసా వెల్లడించింది.
  • భూమి నుంచి పేలోడ్‌ 38 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగానే అప్పటివరకు సిలిండర్‌లా ముడుచుకొని ఉన్న పారాచూట్‌ 0.4 సెకన్‌ వ్యవధిలో పూర్తిస్థాయిలో విచ్చుకుందని వివరించింది.
  • ఇంతటి భారీ పరిమాణంలోని పారాచూట్లు గతంలో ఎన్నడూ అంత వేగంగా విచ్చుకున్న దాఖలాలు లేవని తెలిపింది. నైలాన్‌, టెక్నోరా, కెవ్లార్‌ ఫైబర్‌తో తాజా పారాచూట్‌ను తయారుచేసినట్లు నాసా వెల్లడించింది.
  • దాని బరువు 180 పౌండ్లని తెలిపింది. తాము రూపొందించనున్న అత్యాధునిక రోవర్‌ 2021 ఫిబ్రవరిలో అంగారకుడిపై దిగుతుందని గతంలో ఎన్నడూ పంపించనంత ఎక్కువ పేలోడ్‌ను దానిలో పంపిస్తామని నాసా తెలిపింది. సూపర్‌సోనిక్‌ పారాచూట్‌ 37వేల కిలోల బరువును మోయడం ఇదే ప్రథమం.

views: 776



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams