Current Affairs Telugu Daily

జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా మెర్కెల్‌ రాజకీయ సన్యాసం 
జర్మనీ ఛాన్సెలర్‌ పదవికి మరోసారి పోటీపడబోనని ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించారు. 2021లో ఆమె పదవీకాలం ముగిసిపోతుంది. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగానే ఉంటానని ప్రకటించారు.
  • సొంత పార్టీ సీడీయూలో 2018 డిసెంబరులో జరిగే ఎన్నికల్లోనూ పోటీ చేయనని స్పష్టం చేశారు.
  • తన వారసుడెవరనేది కూడా ఆమె వెల్లడించలేదు. జర్మనీ ఛాన్సెలర్‌గా నాలుగోసారి గద్దెనెక్కిన మెర్కెల్‌ 13 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్నారు. 2000 నుంచి సీడీయూ నాయకురాలిగా పార్టీని నడిపిస్తున్నారు.
  • బలహీన సంకీర్ణకూటమిని నెట్టుకొస్తున్న మెర్కెల్‌పై ఇటీవల విమర్శ తాకిడి ఎక్కువైంది. రాజకీయంగానూ ప్రజల్లో కూటమికి ఆదరణ తగ్గింది. మరోవైపు ప్రతిపక్షాలైన గ్రీన్స్‌, అతివాద భావాలున్న ఏఎఫ్‌డీ పార్టీలకు ప్రజల్లో ఆదరణ పెరిగింది.
  • సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐరోపా దేశాల నుంచి జర్మనీలోకి వలసలను అనుమతించడంతో మెర్కెల్‌పై దేశవ్యాప్తంగా అసంతృప్తి పెల్లుబికింది.

views: 651

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams