Current Affairs Telugu Daily

‘13వ భారత్‌-జపాన్‌ భాగస్వామ్య సదస్సు’లో ప్రధాని మోడి ప్రసంగం
జపాన్‌లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడి టోక్యోలో 2018 అక్టోబర్‌ 29న జరిగిన ‘13వ భారత్‌-జపాన్‌ భాగస్వామ్య సదస్సు’లో ప్రసంగించారు.
  • ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై జపాన్‌ ప్రధాని షింజో అబేతో మోడి విస్త ృతంగా చర్చలు జరిపారు. జపాన్‌ విదేశాంగ మంత్రి టారో కోనో, మరికొందరు మంత్రులు, గవర్నర్లు తదితరులతో విడిగా భేటీ అయ్యారు. భారత్‌ చేపట్టిన కార్యక్రమాలకు జపాన్‌ అందిస్తున్న సహకారాన్ని మోడి కొనియాడారు.
  • యోగా, ఆయుర్వేదంలో సహకారాన్ని పెంపొందించుకునే ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. ఈ రంగాల్లో ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి. భారతదేశ ఆరోగ్య రంగానికి జపాన్‌ నుంచి కృత్రిమ మేధస్సు పరంగా అందించగలిగే సహకారంపై కూడా చర్చలు జరిగాయి.
  • విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ మంత్రుల మధ్య (2G2) సమావేశాలు నిర్వహించాలని రెండు దేశాలూ అంగీకారానికి వచ్చాయి. ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు పనులు పురోగతిని సమీక్షించారు. ఈ పనులకు రుణం నిమిత్తం ఒప్పందంపై రెండు దేశాలూ సంతకాలు చేశాయి.
  • నౌకాదళాల మధ్య సహకారానికీ ఒప్పందం కుదిరింది. త్రివిధ దళాల్లో ప్రతీ దళం సంయుక్త విన్యాసాలు చేపట్టాలన్న నిర్ణయాన్ని ఇరువురు నేతలూ స్వాగతించారు. అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించడానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
  • ఉగ్రవాద సురక్షిత స్థావరాలను, వారికి ఆర్థిక వనరులు అందే మార్గాలను నిర్మూలించడానికి అన్ని దేశాలూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ముంబయి, పఠాన్‌కోట్‌పై దాడులకు పాల్పడినవారిని చట్టం ముందు నిలబెట్టాలని పాక్‌కు విజ్ఞప్తి చేశారు.
  • విదేశీ మారక ద్రవ్యం పరంగా, క్యాపిటల్‌ మార్కెట్లలో స్థిరత్వం కోసం స్థానిక కరెన్సీలో 7500 కోట్ల డాలర్ల వరకు చెల్లింపు చేసేందుకు మీ కల్పించే భారీస్థాయి ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. 

views: 732

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams