Current Affairs Telugu Daily

థ్రిప్టు పథకం ప్రారంభం
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ‘నేతన్నకు చేయూత’ పథకంలో భాగంగా 2017 జూన్‌ 24న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో  మంత్రి కేటీఆర్‌ ‘థ్రిప్టు’ పొదుపు పథకాన్ని ప్రారంభించారు. ‘నేతన్నకు చేయూత’ కరపత్రాన్ని ఆవిష్కరించి, లబ్ధిదారులకు పోస్టల్‌ ఆర్డీ పాసు పుస్తకాలను అందజేశారు. రూ.75 కోట్ల నిధులను కేటాయించి ప్రారంభించిన థ్రిప్టు పథకంలో భాగంగా, ఒక వంతు నగదును కార్మికులు చెల్లిస్తే.. రెండు వంతు నగదును ప్రభుత్వం జమచేసి కార్మికుని ఖాతాలో పొదుపు చేస్తుంది. 3 సం॥ల తర్వాత రూ.లక్ష అందుతాయి. చేనేత అనుబంధ పనులు చేసేవారూ దీనికింద ప్రయోజనం పొందవచ్చు. చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం గతంలో సినీ నటి సమంతను ప్రచారకర్తగా నియమించింది. భూదాన్‌ పోచంపల్లిలోని గ్రామీణ పర్యాటక కేంద్రంలో ఏర్పాటుచేసిన ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ICT) కేంద్రాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. చేనేత వస్త్రాల నూతన డిజైన్ల రూపకల్పనకు  ఈ సంస్థ సాంకేతిక సాయం అందిస్తుంది. కార్మికులకు మార్కెటింగ్‌ మెలవలు నేర్పిస్తారు. 
ICT-Information and communication technology

views: 1145

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams