Current Affairs Telugu Daily

ఈడీ చీఫ్‌గా సంజయ్‌కుమార్‌ మిశ్రా 
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నూతన అధిపతిగా సంజయ్‌కుమార్‌ మిశ్రా నియమితులయ్యారు. డిల్లీలో ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్‌గా ఉన్న మిశ్రా ప్రిన్సిపల్‌ స్పెషల్‌ డైరెక్టర్‌ హోదాలో 3 నెలలపాటు లేదా మరొకరు నియమితులయ్యే వరకు ఈడీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
  • కర్నాల్‌ సింగ్‌ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో  సంజయ్‌కుమార్‌ మిశ్రాను నియమిస్తూ కేబినెట్‌ నియామకాల కమిటీ 2018 అక్టోబర్‌ 27న నిర్ణయం తీసుకుంది.
  • 1984 ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌(ఐఆర్‌ఎస్‌) ఆదాయ పన్ను(ఐటీ) కేడర్‌ అధికారి అయిన మిశ్రాకు పలు కీలక కేసుల బాధ్యతలు చూశారు.
  • పీఎన్‌బీని వేల కోట్ల మేరకు మోసం చేసిన నీరవ్‌ మోడి, లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కొడుకు కార్తీ మనీ లాండరింగ్‌ కేసు విచారణలో మిశ్రా కీలకంగా ఉన్నారు.
  • నల్లధనం చెలామణీని అరికట్టే మనీలాండరింగ్‌ చట్టం(పీఎంఎల్‌ఏ), విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టం(ఫెమా) అమలును పర్యవేక్షించడం ఈడీ ముఖ్య బాధ్యత.

views: 707

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams