Current Affairs Telugu Daily

భారత ప్రధాని నరేంద్రమోడి జపాన్‌ పర్యటన
జపాన్‌ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడి 2018 అక్టోబర్‌ 27న పశ్చిమ టోక్యోకు చేరుకున్నారు. జపాన్‌ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. పారిశ్రామిక రోబోల తయారీ కర్మాగారాన్ని సందర్శించి, అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. అక్టోబర్‌  28, 29 తేదీల్లో జరిగే 13వ భారత్‌-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోడి పాల్గొననున్నారు.
  • మోడి గౌరవార్థం అబే విందునిచ్చారు. రాజస్థాన్‌లో చేతితో రూపొందించిన రాతి కానుకను, ఉత్తరప్రదేశ్‌ చేనేత కళాకారులు నేసిన రగ్గు, జోధ్‌పురీ కలపతో తయారైన భోషాణాన్నీ షింజోఅబేకు నరేంద్రమోడి కానుకగా ఇచ్చారు.
  • ఇద్దరు నేతలు కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద రోబో తయారీ పరిశ్రమలో ఒకటైన ‘ఫనుక్‌’ కార్పొరేషన్‌కు వెళ్లారు. రోబో తయారీ, యాంత్రికీకరణ ప్రక్రియ, వాటి పనితీరును పరిశీలించారు.

views: 662

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams