Current Affairs Telugu Daily

శ్రీలంక ప్రధానిగా రాజపక్సె
శ్రీలంక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.  ప్రధాని రణిల్‌ విక్రమసింఘేకు అధ్యక్షుడు సిరిసేన ఉద్వాసన పలికారు. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సెను ప్రధానిగా 2018 అక్టోబర్ 26న  ప్రమాణ స్వీకారం చేశారు.
  • ఈ పరిణామానికి ముందు విక్రమసింఘేకు చెందిన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ), శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు సంబంధించిన రాజకీయ కూటమి ‘యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రీడం అలయెన్స్‌’ (యూపీఎఫ్‌ఏ)తో కూడిన సంకీర్ణ ఐక్య సర్కారు ఉండేది.
  • ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు యూపీఎఫ్‌ఏ 2018 అక్టోబర్ 26న ఆకస్మికంగా ప్రకటించింది. కొద్దిరోజులుగా సిరిసేనకు, విక్రమసింఘేకు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో యూఎన్‌పీ ఈ నిర్ణయం తీసుకుంది.
  • తనను, రాజపక్సె సోదరుడు గోతభయ రాజపక్సెను హత్య చేయడానికి జరిగిన కుట్రను యూఎన్‌పీ తీవ్రంగా పరిగణించలేదని సిరిసేన ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి.
  • విక్రమసింఘే నేతృత్వంలోని ఐక్య ప్రభుత్వం 2015లో ఏర్పడింది.

views: 718

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams