Current Affairs Telugu Daily

ముగ్గురు పిల్లల్లో ఒకరిని దత్తత ఇచ్చినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు : సుప్రీం
మూడో బిడ్డకు జన్మనివ్వడంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హత వేటు పడిపోతుందని, ఒక బిడ్డను దత్తత ఇచ్చినా ఇద్దరు పిల్లల నిబంధన వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
  • అలాంటివారు పంచాయతీ సర్పంచిగా, లేదా వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి అనర్హులేనని స్పష్టం చేసింది.
  • 2002 ఫిబ్రవరిలో సర్పంచిగా ఎన్నికైన తనకు ఆ ఏడాది ఆగస్టులో మూడో బిడ్డ పుట్టడంతో పదవిలో కొనసాగడానికి అనర్హుడినంటూ ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మీనాసింగ్‌ మాఝీ అనే గిరిజన సర్పంచి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. తాను మొదటి బిడ్డను 1999లోనే దత్తత ఇచ్చేశానని చెప్పారు.
  • అందువల్ల పదవిలో కొనసాగడానికి అర్హుడినేనని వాదించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
  • ‘ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయరాదని పంచాయతీరాజ్‌ చట్టం చెబుతోంది. జననా సంఖ్యను నియంత్రించడం ఈ చట్టం ఉద్దేశ’మని వ్యాఖ్యానించింది.

views: 709

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams