Current Affairs Telugu Daily

అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం రాష్ట్రాల మధ్య దేశంలోనే పొడవైన రైలు-రోడ్డు బ్రిడ్జి
దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన ఈశాన్య భారతంలో రూపుదిద్దుకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం రాష్ట్రాల మధ్య బ్రహ్మపుత్ర నదిపై భారతీయ రైల్వే శాఖ ఈ ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని ఆవిష్కరించింది.
  • దీని పొడవు 4.94 కిలోమీటర్లు. అసోంలోని దిబ్రూగఢ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాలసీఘాట్‌ నగరాలను కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మించారు.
  • వంతెనపైన మూడు లేన్ల రోడ్డు, కింది భాగంలో రైండు రైల్వే ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. త్వరలో ప్రారంభోత్సవం జరపుకోనున్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2002లో నాటి ప్రధాని అటల్‌ బిహారి వాజపేయి శంకుస్థాపన చేశారు.

views: 709



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams