Current Affairs Telugu Daily

భారత్‌-చైనా సరిహద్దు వెంబడి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే లైను
భారత్‌-చైనా సరిహద్దు వెంబడి సముద్ర మట్టానికి 5,360 మీటర్ల పైన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే మార్గాన్ని భారత రైల్వే నిర్మించనుంది.
  • దీనికి సంబంధించిన మొదటి సర్వే పూర్తయింది. ఈ రైల్వే లైనును వ్యూహాత్మకంగా బిలాస్‌పూర్‌-మనాలి-లేహను కుపుతూ నిర్మించనున్నారు.
  • దీని నిర్మాణం పూర్తయితే డిల్లీ-లేహ్ మధ్య ప్రయాణ సమయం 40 గంటల నుంచి 20 గంటలకు తగ్గనుంది.
  • రైల్వే లైను మొత్తం పొడవు 465 కిలోమీటర్లు, అంచనా వ్యయం 83,360 కోట్ల రూపాయు. దీన్ని సముద్ర మట్టానికి 5,360 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. రైల్వే లైను సగం కంటే ఎక్కువ అంటే 244 కిలోమీటర్ల దూరం టన్నెళ్లలోనే ఉంటుంది. అతి పెద్ద టన్నెల్‌ పొడవు 27 కిలోమీటర్లు ఉంటుంది.

views: 683

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams