Current Affairs Telugu Daily

కెనడా కోర్టు న్యాయమూర్తిగా తలపాగా ధరించిన తొలి సిక్కు మహిళ 
కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా రాష్ట్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన పల్బీందర్‌ కౌర్‌ షెర్గిల్‌ నియమితులయ్యారు. న్యూవెస్ట్‌ మిన్‌స్టెర్‌లోని ఈ ఉన్నత న్యాయస్థానంలో తలపాగా ధరించిన తొలి సిక్కు జడ్జి కౌర్‌ కావడం విశేషం. కెనడా సుప్రీం కోర్టు సహా భిన్న న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లలో ఆమె పనిచేశారు. మానవ హక్కుల ఉద్యమకర్తగా కూడా పల్బీందర్‌ కౌర్‌ షెర్గిల్‌కు పేరుంది. కెనడాలోని మానవ హక్కులు, మత సామరస్యం బిల్లు రూపకల్పనలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు.
views: 878

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams