Current Affairs Telugu Daily

నూర్‌-ఉల్‌-ఇస్లాం వర్సిటీ విద్యార్థి బృందానికి రూ.10 లక్షల నజరానా
తేలికపాటి కృత్రిమ ఉపగ్రహాన్ని రూపొందించిన నూర్‌-ఉల్‌-ఇస్లాం యూనివర్సిటీ విద్యార్థుల బృందానికి తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. కరూర్‌ జిల్లాకు చెందిన రిఫాద్‌ షారూక్‌ నేతృత్వంలోని ఆరుగురు విద్యార్థులతో కూడిన బృందం 64 గ్రాముల బరువుండే అతి చిన్న కృత్రిమ ఉపగ్రహాన్ని రూపొందించి షార్‌ నుంచి ప్రయోగించారు. రిఫాద్‌తోపాటు యజ్ఞసాయి, వినయ్‌ భరద్వాజ్‌, తనిష్క్‌ దివేది, గోపీనాథ్‌, మహ్మద్‌ అబ్దుల్‌ కాసిబ్‌కు సీఎం పళనిస్వామి అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 2017 జూన్‌ 23న ప్రయోగించిన PSLV-సి38 ద్వారా వీరు రూపొందించిన NIUSATను అంతరిక్షంలోకి పంపించారు.
views: 904

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams