Current Affairs Telugu Daily

DRDL డైరెక్టర్‌గా డాక్టర్‌ దశరథ్‌రామ్‌ 
క్షిపణుల అభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల(DRDL) డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ దశరథ్‌రామ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.
  • ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణి అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించారు. హైపర్‌సోనిక్‌ విండ్‌ టన్నెల్‌ సిస్టమ్‌ అభివృద్ధితో ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది.
  • దీర్ఘశ్రేణి క్షిపణుల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిలో అపారమైన కృషి చేశారు. 
DRDL-Defence Research and Development Laboratory

views: 743

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams