Current Affairs Telugu Daily

కర్ణాటకలో మహిళా పోలీసులకు ఖాకీ ప్యాంట్‌, షర్ట్‌
కర్ణాటక పోలీసు శాఖ మహిళా పోలీసుల డ్రెస్‌ కోడ్‌లో సంపూర్ణ మార్పులు తెచ్చింది. విధి నిర్వహణలో అనుకూలంగా ఉండేలా ఖాకీ చీర స్థానంలో ఖాకీ ప్యాంట్‌, షర్ట్‌ ధరించాలనే ఆదేశాలు 2018 అక్టోబర్‌ 20 నుంచి అమలులోకి వచ్చాయి.
  • మహిళా కానిస్టేబుళ్లు చీరలు ధరించి విధులు నిర్వర్తించడం కష్టతరంగా ఉండటం, నేరాలు జరిగిన సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి, నేరస్థులను వెంబడించడానికి  ఇబ్బందిగా ఉండటంతో డ్రెస్‌ కోడ్‌లో మార్పు చేశారు.
  • ఇకపై  చీరకు బదులు ఖాకీ ప్యాంట్‌, షర్ట్‌  ధరించాలని, చెవి కమ్మలు, నుదుట బొట్టు, చేతి గాజులు చిన్నసైజులో ఉండాలని, ఒక చేతికి చిన్నసైజులో లోహంతో చేసిన గాజు ధరించవచ్చంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు.
  • కేశాంకరణలో కొన్ని మార్పు చేశారు. జుట్టును వదుగా వదిలేయకుండా కొప్పుగా చుట్టి నల్లరంగు నెట్టెడ్‌ బ్యాండ్‌తో ముడి వేసుకోవాలని ఆదేశాల్లో సూచించారు. నల్లరంగు హెయిర్‌డై మినహా జుట్టుకు ఏ ఇతర రంగు వేయరాదు.
  • పూలు పెట్టుకోవడాన్ని కూడా నిషేధించారు. శాఖలోని మహిళా అధికారి నుంచి సిబ్బంది వరకు ఒకే డ్రస్‌కోడ్‌  అమలులో ఉంటుంది. 

views: 756

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams