Current Affairs Telugu Daily

CBI ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాపై కేసు నమోదు
CBI ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాపై ఆ సంస్థ కేసు నమోదు చేసింది. మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషీతో ముడిపడి ఉన్న ఒక కేసులో ఓ వ్యాపారి పేరును తప్పించడానికి లంచం తీసుకున్నారన్న అభియోగంపై CBI ఈ చర్యను చేపట్టింది.
  • గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన ఆస్థానా.. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్‌ కుంభకోణం, విజయ్‌ మాల్యా రుణ ఎగవేత వంటి ముఖ్యమైన కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు.
  • హవాలా మార్గంలో దుబాయ్‌, లండన్‌ సహా అనేక దేశాలకు నిధులను చేరవేస్తున్నాడని ఖురేషీపై CBI అనేక కేసులు నమోదు చేసింది. వీటిని ఆస్థానా పర్యవేక్షిస్తున్నారు. 
CBI డైరెక్టర్‌ - అలోక్‌వర్మ 
CBI-Central Bureau of Investigation

views: 729



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams