Current Affairs Telugu Daily

అసోం-మేఘాలయల మధ్య 19.3 కి.మీ వారధి
అసోమ్, మేఘాలయల మధ్య ప్రయాణదూరం, కాలాన్ని తగ్గించడానికి బ్రహ్మపుత్ర నదిపై నాలుగు వరుసల రహదారి వంతెనను నిర్మించనున్నారు. మేఘాలయలోని ఫుల్బరి, అసోంలోని దుబ్రీలను అనుసంధానం చేసే ఈ వంతెన పూర్తి అయితే మనదేశంలోనే అతిపొడవైన వంతెనగా చరిత్రపుటలకెక్కనుంది. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల మధ్య ప్రయాణించాలంటే నర్‌నారాయణ్‌ వంతెన మీదుగా వాహనాలు 203 కిమీ ప్రయాణించాల్సి వస్తోంది. లేదంటే చిన్నచిన్న పడవలే దిక్కు.
నదిపై 19.3 కిమీ పొడవునా వంతెన నిర్మిస్తే రెండున్నర గంటలు పడుతున్న ప్రయాణకాలం 15-20 నిముషాలకు తగ్గిపోనుంది. ఇది పూర్తి అయితే పశ్చిమబెంగాల్‌ నుంచి అసోంకూ రాకపోకలు సులువవుతాయి. ఈ ఆర్థికసంవత్సరంలోనే టెండర్లు పూర్తి చేసి, 2026-27నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్మాణబాధ్యతలు చేపట్టిన జాతీయ రహదారులు, పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్ఐడీసీఎల్‌) భావిస్తోంది. 

views: 734

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams