Current Affairs Telugu Daily

అమరావతిలో ప్రపంచ బ్యాంక్‌ బృందం పర్యటన

రాజధాని పర్యటన నిమిత్తం ఇంకొక పర్యాయం ప్రపంచ బ్యాంక్‌ బృందం ఇక్కడికి రాబోతోంది. అమరావతిలోని కొన్ని ప్రాధాన్య రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టులకు సుమారు రూ.7,000 కోట్ల రుణ సహాయం అందజేయాలన్న ఏపీసీఆర్డీయే అభ్యర్థన దరిమిలా ఇప్పటికే పలుసార్లు ఈ బ్యాంక్‌ ప్రతినిధులు రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఇదే కోవలో ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే 4 రోజులపాటు అమరావతిలో గడపనున్న ప్రపంచ బ్యాంక్‌ బృంద సభ్యులు ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులతో చర్చలు జరపడంతోపాటు క్షేత్ర పరిశీలన కూడా చేయనున్నారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠాతోనూ వారు భేటీ అయ్యే అవకాశముంది.


views: 808

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams