Current Affairs Telugu Daily

దసరా రోజున జాతీయజెండా ఆవిష్కరణ
దసరా రోజు ఆయుధ పూజ చేయడం, బంధుమిత్రులకు బంగారం(జమ్మి) పంచడం సంప్రదాయం. అయితే, ఇవన్నీ చేస్తూనే పండుగ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు మహబూబాబాద్‌ జిల్లా గార్ల గ్రామస్థులు. మతసామరస్యానికి ప్రతీకగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం తొలుత నిజాం కాలంలో మొదలైంది. అప్పట్లో గార్ల తహసీల్దార్‌ నూరుద్దీన్‌షా దసరా రోజున నెలవంకను పోలిన ప్రత్యేక జెండాకు దేవాలయాల్లో పూజలు జరిపించి గార్ల మసీద్‌ ఎదురుగా ఆవిష్కరించేవారు. అనంతరం 1958లో గార్ల మున్సిపాలిటీగా ఏర్పడ్డాక ప్రత్యేక జెండా స్థానంలో కాంగ్రెస్‌ తమ పార్టీ జెండాను ఎగురవేసింది.
దీనిపై కమ్యూనిస్టులు హైకోర్టుకు వెళ్లడంతో.. కాంగ్రెస్‌ జెండాకు బదులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని సూచించింది. అప్పటి నుంచి దసరా రోజున జాతీయ జెండాను ఎగురవేయడాన్ని గార్ల ప్రజలు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి గ్రామపంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌ ఏలూరి అనూరాధ జాతీయ పతాకంతో ముందుగా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మసీదు సెంటర్‌ ఎదుట జెండాను ఆవిష్కరించారు.

views: 715

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams