Current Affairs Telugu Daily

గోల్‌కీపర్‌ ఆకాశ్‌ చిక్టేపై రెండేళ్ల నిషేధం

నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న భారత క్రీడాకారులపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) సస్పెన్షన్‌ వేటు వేసింది. భారత హాకీ గోల్‌ కీపర్‌ ఆకాశ్‌ చిక్టేపై రెండేళ్లు, రెజ్లర్‌ అమిత్, కబడ్డీ ప్లేయర్‌ ప్రదీప్‌ కుమార్, వెయిట్‌లిఫ్టర్‌ నారాయణ్‌ సింగ్, అథ్లెట్స్‌ సౌరభ్‌ సింగ్, బల్జీత్‌ కౌర్, సిమర్జిత్‌ కౌర్‌లపై నాలుగేళ్ల నిషేధం విధించారు.ఇందులో నిషిద్ధ ఉత్ప్రేరకాలైన అనబాలిక్‌ స్టెరాయిడ్‌ తీసుకున్నట్లు తేలింది.
2016 ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టుకు ఆకాశ్‌ గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు


views: 609

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams