Current Affairs Telugu Daily

ఎన్డీ తివారీ కన్నుమూత 

 కాంగ్రెస్‌ కురు వృద్ధుడు.. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం తన 93వ పుట్టినరోజునే తుదిశ్వాస విడిచారు. దిల్లీలోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో ఆయన పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మూడు సార్లు సేవలందించారు. 2002 నుంచి 2007 వరకు ఉత్తరాఖండ్‌కూ సీఎంగా ఉన్నారు. దేశంలో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి తివారీనే. 2007 నుంచి 2009 వరకు ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గానూ సేవలందించారు. ఎన్డీ తివారీ పూర్తి పేరు నారాయణ్‌ దత్‌ తివారీ. 1925 అక్టోబర్‌ 18న నైనీతాల్‌లో ఆయన జన్మించారు. 


views: 659

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams