Current Affairs Telugu Daily

గర్భాశయమార్పిడి ద్వారా తొలి ప్రసవం

గర్భాశయ మార్పిడి చేయించుకున్న మహిళకు గురువారం పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఈ తరహా కాన్పు దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. బిడ్డ సాధారణ ప్రసవం ద్వారా జన్మించిందని.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

గుజరాత్‌లోని వడోదరకు చెందిన మీనాక్షీ వాలన్‌ అనే 28 ఏళ్ల మహిళకు గతంలో గర్భస్రావం జరిగి ఆమె గర్భాశయాన్ని తొలగించారు. దీంతో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది. వైద్యుల సలహా మేరకు మీనాక్షి గర్భాశయ మార్పిడి చేయించుకోవాలని నిశ్చయించుకుంది. దీని కోసం ఆమె తల్లి గర్భాశయం దానం చేశారు. అనంతరం ఆమె ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ విధానం ద్వారా గర్భం ధరించారు. వరుసగా మూడు సార్లు గర్భ స్రావం జరిగిన అనంతరం ఇప్పుడు ఆమెకు ఆడబిడ్డ జన్మించింది.

గర్భాశయ మార్పిడి ద్వారా దేశంలో జరిగిన తొలి ప్రసవం ఇదేనని వైద్యురాలు వర్తీ వెల్లడించారు. ఇంతకుముందు స్వీడెన్‌లో తొమ్మిది గర్భాశయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని, తర్వాత అమెరికాలో రెండు జరిగాయని వివరించారు. ఇప్పుడు భారత్‌లో జరిగిన ప్రసవం ప్రపంచంలో పన్నెండోదిగా ఆమె పేర్కొన్నారు


views: 692

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams