Current Affairs Telugu Daily

తిరుమలలో శీఘ్ర దర్శనం
తెలంగాణ పర్యాటకశాఖ కొత్త ప్యాకేజీ
ఈనాడు, హైదరాబాద్‌: తిరుమలలో శ్రీవారి శీఘ్ర దర్శనానికి వెళ్లే భక్తులకు తెలంగాణ పర్యాటకశాఖ సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొత్త ప్యాకేజీ తిరుపతి నుంచి ప్రారంభం అవుతుంది. తిరుపతి చేరుకున్న వారికి కొంతసేపు సేదతీరేందుకు హోటల్‌లో వసతి కల్పిస్తారు. ఆ తర్వాత తిరుమలపైకి బస్సులో తీసుకెళ్లడం, శీఘ్ర దర్శనం చేయించడం, తిరిగి తిరుపతి తీసుకురావడం వరకు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి

views: 813

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams