Current Affairs Telugu Daily

ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా
జనావాసాల్లో ఉక్కు శుద్ధి పరిశ్రమల నియంత్రణలో విఫలమైన ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా పడింది. నిషేదిత ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కావడంవల్ల స్థానికులకు అనారోగ్య సమస్యలతో పాటు యుమునా నది కాలుష్యానికి గురవుతోందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయెల్‌ నేతృత్వంలోని బెంచ్‌ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 50 కోట్లు పెనాల్టీ విధిస్తూ తీర్పు వెలువరించింది. జనావాసాల్లో నెలకొల్పిన స్టీల్‌ శుద్ధి పరిశ్రమలను వెంటనే మూసేయించాలని ఆదేశాలు జారీచేసింది.
NGT-National Green Tribunal

views: 679

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams