Current Affairs Telugu Daily

ఏటా సైక్లోన్‌ డే
2014 తరువాత రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ, రియల్‌టైం గవర్నెన్స్‌ (ఆర్‌టీజీ)ల నుంచి ప్రజలకు అందుతున్న సమాచారం నిర్దుష్టంగా ఉంటోంది. నాలుగేళ్ల వ్యవధిలో ప్రధానంగా హుద్‌హుద్‌, తిత్లీ తుపాన్లు వచ్చాయి. ఇస్రో సాయంతో వీటిని ముందుగా పసిగట్టి ఖచ్చితంగా ఎక్కడ తీరాన్ని దాటుతాయి? ప్రభావం ఏమేరకు ఉంటుందన్నది చెప్పగలిగారు. ఫలితంగా తిత్లీలో ప్రాణనష్టాన్ని అంకెకు తగ్గించగలిగారు. హుద్‌హుద్‌ తుపాను ప్రభావం తగ్గాక యుద్ధప్రాతిపదికన తీసుకున్న సహాయచర్యలతో అతి తక్కువ సమయంలో యథాతథ స్థితికి తీసుకురావటం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై బ్లూబుక్‌ రూపొందించి రాష్ట్రం కేంద్రానికి సమర్పించింది. తాజా తిత్లీలో మాత్రం హుద్‌హుద్‌ సమయంనాటి వేగంతో పోలిస్తే సహాయ చర్యలలో వెనకంజ ఉన్నట్లు కనిపిస్తోంది. రహదారులకు అడ్డంగాపడిన భారీ వృక్షాలు, వేలల్లో కూలిన విద్యుత్తు స్తంభాలు.. మారుమూల ప్రాంతాలలో సహాయచర్యలకు అడ్డంకిగా మారాయి. ఈ రెండింటి అనుభవాల ఆధారంగా తుపాన్లను ఎదుర్కోవటంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, వివిధ వర్గాల ప్రజలను సన్నద్ధపర్చడానికి కొన్ని నిర్దుష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
భూకంపాలు తీవ్రంగా ఉండే దేశాల్లో అవి వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై పాఠశాల విద్య స్థాయిలోనే పిల్లలకు అవగాహన కల్పిస్తారు. తుపాన్లు వచ్చినప్పుడు, భారీ వర్షాలు కురిసేటప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై కోస్తా ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు సహాయ చర్యలు చేపట్టే సంబంధిత శాఖల సిబ్బందితో అవగాహన కల్పిస్తారు. దీనికోసం ఏటా ఒక రోజును సైక్లోన్‌ డే గా గుర్తిస్తారు.

views: 757

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams