భారత్‌లో చమురు డిమాండ్‌ను అందుకునేందుకు సౌదీ అరేబియా
‘ఇండియా ఎనర్జీ ఫోరమ్’లో సౌదీ మంత్రి ఖలీద్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న సౌదీ అరేబియా.. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కల్పించేలా అదనపు సామర్థ్యంపై పెట్టుబడులు పెట్టకుంటే ఆ ‘బాధ’ మరింత పెరిగేది’’ అని చెప్పారు. భారత్‌లో పెరుగుతున్న చమురు డిమాండ్‌ను అందుకునేందుకు సౌదీ అరేబియా కట్టుబడి ఉందన్నారు. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం భారత్‌లో వ్యాపారాన్ని సులభతరం చేసిందని చెప్పారు. ఇప్పటికే ఇరాన్‌పై ఆంక్షలు విధించారని చెప్పారు. ‘‘సరఫరాలో అవరోధాలను తట్టుకోవడానికి ఒక షాక్ అబ్జార్బర్ కావాలి. ఈ పాత్రను సౌదీ అరేబియా పోషిస్తోంది. అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్మించుకోవడానికి వందల కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టాం’’ అని పేర్కొన్నారు. చమురు రంగంలో భారత్‌తో భాగస్వామ్యానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇరాక్ తర్వాత భారత్‌కు రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా సౌదీ అరేబియా ఉంది.
views: 723