Current Affairs Telugu Daily

సిక్కింకు ‘ఫ్యూచర్‌ పాలసీ’ అవార్డు
100 శాతం ‘సేంద్రియం’గా రికార్డులకెక్కిన సిక్కిం రాష్ట్రానికి ఫ్యూచర్‌ పాలసీ అవార్డ్‌ లభించింది. సిక్కిం అనుసరిస్తున్న పర్యావరణహిత విధానాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ విభాగం ఎఫ్‌ఏవో 2018 అక్టోబర్‌ 15న ఈ అవార్డును ప్రదానం చేసింది. ఇటలీలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ సహా మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
  • ఫ్యూచర్‌ పాలసీ అవార్డ్‌గా నామకరణం చేసిన ఈ పురస్కారాన్ని ‘మేలిమి విధానాలకు ఆస్కార్‌’ గా అభివర్ణిస్తుంటారు.
  • దీన్ని గెలుచుకొనేందుకు 25 దేశాలకు చెందిన 51 నామినేషన్లతో సిక్కిం పోటీపడింది.
  • బ్రెజిల్‌, డెన్మార్క్‌, ఈక్వెడార్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్‌ఏవో, వరల్డ్‌ ఫ్యూచర్‌ కౌన్సిల్‌(డబ్ల్యూఎఫ్‌సీ), ఐఎఫ్‌వోఏఎం-ఆర్గానిక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సంయుక్తంగా ఈ అవార్డును ప్రదానం చేస్తుంటాయి.
  • సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నట్లు 2003లోనే సిక్కిం అధికారికంగా ప్రకటించింది.

views: 755

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams