Current Affairs Telugu Daily

3డీ ముద్రిత ఎముక కణజాలం 
మానవ కణజాలాన్ని 3డీ ముద్రణ కణాలతో అభివృద్ధి చేసే సరికొత్త విధానాన్ని పరిశోధకులు కనిపెట్టారు. ఎముకలు, కండరాలను కలిపివుంచే బంధనాలను (లిగమెంట్లు) దీని సాయంతో ఉత్పత్తి చేయొచ్చు. ఎముకలకు తీవ్ర గాయాలైనప్పుడు పరిసరాల్లోని లిగమెంట్లు దెబ్బతింటాయి. దీంతో శరీరంలోని వేరే భాగాలకు కోతపెట్టి ఇక్కడి గాయాన్ని మాన్పిస్తుంటారు. వేరోచోట నుంచి తీసుకొచ్చే కణజాలంతో లేనిపోని ఇబ్బందులు చుట్టుముడుతుంటాయి. వీటికి చెక్‌ పెట్టడమే లక్ష్యంగా అమెరికాలోని యూటా వర్సిటీ నిపుణులు పరిశోధన చేపట్టారు. రోగి కొవ్వు కణాల్లోని మూల కణాను వారు లక్ష్యంగా చేసుకున్నారు. వీటిని హైడ్రోజెల్‌పై పొరలుపొరలుగా 3డీ పరిజ్ఞానంతో ముద్రించారు. అనంతరం అనుకున్న ఆకారంలోకి ఇవి మారేలా చూసేందుకు ప్రత్యేక పోషకాలు అందించారు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. 
views: 735

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams