Current Affairs Telugu Daily

ఒడిశా పోలీసు అధికారి ప్రమోద్‌కుమార్‌ సత్పతికి అశోకచక్ర
నక్సల్స్‌తో పోరాడుతూ వీరమరణం పొందిన ఒడిశా పోలీసు అధికారి ప్రమోద్‌కుమార్‌ సత్పతికి కేంద్రం అశోకచక్ర అవార్డు ప్రకటించింది.
  • స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పనిచేసిన సత్పతి 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. సత్పతి ధైర్యసాహసాలు గుర్తిస్తూ ఆయనకు మరణానంతరం అశోకచక్రను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ 2018 అక్టోబర్‌ 14న వెల్లడించింది.
  • దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రాణత్యాగం చేసిన పోలీసు జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపంపై సత్పతి పేరును కూడా చేర్చనున్నట్లు వెల్లడించింది. 

views: 759



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams