Current Affairs Telugu Daily

రోమెరో, పోప్‌ పాల్‌-6కు సెయింట్‌హుడ్‌
హత్యకు గురైన, ఎల్‌ సాల్వడార్‌కు చెందిన ఆర్చ్‌బిషప్‌ ఆస్కార్‌ అర్నుల్‌ఫో రోమెరో గాల్డమెజ్‌తోపాటు ఇటలీకి చెందిన పోప్‌ పాల్‌-6కు సెయింట్‌హుడ్‌ను పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రదానం చేశారు.
  • రైతు హక్కు కోసం పోరాడిన రోమెరో 1980లో చర్చిలోనే హత్యకు గురయ్యారు. పోప్‌ పాల్‌-6పై కూడా 1970లో ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో హత్యాప్రయత్నం జరిగినా అప్పట్లో ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
  • 1978లో అనారోగ్యంతో మరణించారు. వీరిద్దరికీ సెయింట్‌హుడ్‌ ఇస్తున్నట్లు 2018 అక్టోబర్‌ 14న వాటికన్‌లో ప్రార్థన కోసం హాజరైన వేలాది మంది భక్తులు ముందు పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రకటించారు. ఎముక కేన్సర్‌తో చనిపోయిన, ఇటీలీకి చెందిన అనాథ బాలుడు, జర్మన్‌ నన్‌ సహా మరో ఐదుగురికి కూడా పోప్‌ ఫ్రాన్సిస్‌ సెయింట్‌హుడ్‌ ప్రసాదించారు.
  • హత్యకు గురైన సమయంలో రోమెరో రక్తంతో తడిసిన తాడును బెల్ట్‌గా ధరించి పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్‌ సాల్వడార్‌ అధ్య క్షుడు సాంచెజ్‌ సెరెన్‌, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్‌, స్పెయిన్‌ రాణి సోఫియా హాజరయ్యారు.
సెయింట్‌హుడ్‌ హోదా... 
  • సెయింట్‌హుడ్‌ను పొందటమంటే రోమన్‌ క్యాథలిక్‌ చర్చిలో అత్యున్నత స్థాయిని పొందటమే. ఒక వ్యక్తిని సెయింట్‌ (సన్యాసి)గా ప్రకటించేందుకు మొత్తంగా 5 దశలు ఉంటాయి.
  • వ్యక్తిని సన్యాసిగా ప్రకటించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా ఆ వ్యక్తి చనిపోయిననాటి నుంచి కనీసం 5 సం॥లు ఆగాలి. ఆ తర్వాత సదరు వ్యక్తి చనిపోయిన ప్రాంతంలోని క్రైస్తవ మతగురువు విచారణ జరిపి, ఆ వ్యక్తి పవిత్రత, సత్యనిష్టత గురించి వివరాలు సేకరిస్తారు.
  • సెయింట్‌ హోదా ఇవ్వదగిన వ్యక్తిగా తేలితే ఆ విషయాన్ని వారు సెయింట్‌ను సిఫారసు చేసే ఓ కమిటీకి తెలుపుతారు. ఆ తర్వాత సదరు చనిపోయిన వ్యక్తికి అద్భుత శక్తులున్నట్లు తేలాలి.
  • అంటే ఆ వ్యక్తి తమ కలలో కనిపించాడని, తమ అనారోగ్యాన్ని బాగు చేయడమో, కష్టాలను తీర్చాడనో ఎవరో ఒకరు చెప్పాలి. వాటిలోని వాస్తవాలను పరీక్షించిన అనంతరం అదొక అద్భుత మని రుజువైతే వారిని బీటిఫై చేస్తారు. ఆ తర్వాత మరోసారి అలాంటి అద్భుతం జరిగినట్లు తేలితే వారికి సెయింట్‌ హోదా ఇస్తారు.

views: 628

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams