Current Affairs Telugu Daily

బ్రిటన్‌లో మొట్టమొదటిసారి అంధునికి అశ్వం అండ 
లండన్‌లో భారత సంతతికి చెందిన 24 ఏళ్ల అంధ పాత్రికేయుడు మహమ్మద్‌ సలీం పటేల్‌కు గుర్రం తోడుగా ఉండనుంది. ఇలాంటి ప్రయోగం బ్రిటన్‌లో ఇదే ప్రథమం. లాంక్‌షైర్‌లోని బ్లాక్‌బర్న్‌కు చెందిన మహమ్మద్‌ సలీం పటేల్‌కు రెటినిటిస్‌ పిగ్మెంటోజా వ్యాధి సోకడంతో క్రమేణా దృష్టి కోల్పోయే పరిస్థితి వచ్చింది.
  • ప్రస్తుతం కుడి కన్ను కొద్దిగా కనిపిస్తోంది. మరికొద్ది కాలంలో మొత్తం చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో శిక్షణ పొందిన శునకాలను వారికి తోడుగా పెడతారు. పటేల్‌కు చిన్నప్పటి నుంచీ కుక్కలంటే భయం ఉండడంతో వాటి సాయం తీసుకోవడానికి ఇష్టపడలేదు.
  • దాంతో అశ్వం సహాయం తీసుకుంటే బాగుంటుందని నిర్ణయించారు. డిగ్బీ అనే ఏడాదిన్నర వయసు ఉన్న గుర్రం పిల్లకు ఇప్పటికే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటికే డిగ్బీ పేరు మారుమోగిపోతోంది.
  • వార్షిక ఏంప్లిఫాన్‌ అవార్డుల్లో ‘హీరో పెట్‌’ విభాగం కింద బహుమతి పొందింది. అంధు రేడియో జర్నలిజాన్ని అధ్యయనం చేయడం కష్టమన్న అభిప్రాయం ఉన్నప్పటికీ పటేల్‌.. ఇబ్బందున్నింటినీ అధిగమించి ఆ కోర్సును పూర్తి చేశారు.
  • బీబీసీ రేడియో స్టేషన్‌లో విలేకరిగా ఉద్యోగం కూడా పొందారు. మహమ్మద్‌ సలీం పటేల్‌ తల్లిదండ్రు గుజరాత్‌కు చెందినవారు.

views: 651

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams