Current Affairs Telugu Daily

2300 నాటికి 50 అడుగులు పెరగనున్న సముద్ర మట్టాలు
గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాన్ని కట్టడి చేయకుంటే తీరప్రాంత ప్రజలకు తీవ్ర ముప్పేనని అమెరికాలోని రుట్గేర్స్‌ వర్సిటీ పరిశోధకుల నివేదిక హెచ్చరించింది.
  • పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి 8 అడుగులు, 2300 నాటికి 50 అడుగుల మేర సముద్ర మట్టాలు పెరిగిపోతాయని స్పష్టం చేసింది. సముద్ర మట్టానికి 33 అడుగుల లోపల ప్రపంచవ్యాప్తంగా 11 శాతం జనాభా నివసిస్తోంది.
  • సముద్ర మట్టాలు పెరగడం తీరప్రాంత ప్రజలకు పెనుముప్పుగా పరిణమించడమే కాకుండా జీవావరణ వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు కుదేలవుతాయని పరిశోధకులు స్పష్టం చేశారు.

views: 653

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams